బేరాసారాలంతా ఫేక్

Date:21/05/2018
బెంగళూర్ ముచ్చట్లు:
కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవడానికి గట్టిగానే ప్రయత్నించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు బలనిరూపణకు కేవలం ఒక రోజు సమయం ఇవ్వడంతో బీజేపీ నేతలు ఉరుకులు పరుగుల మీద ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపించారు. దీనికి సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్స్‌ను కాంగ్రెస్ విడుదల చేసింది.సాక్షాత్తూ యడ్యూరప్పతోపాటు గాలి జనార్దన్రెడ్డిలాంటి నేతలు తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని ఆరోపిస్తూ ఫోన్లలో మాట్లాడిన మాటలను మీడియాకు రిలీజ్ చేసింది. ఇలాంటిదే ఎల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్‌కు సంబంధించినది అంటూ కాంగ్రెస్ ఓ ఆడియో క్లిప్ రిలీజ్ చేసింది. ఓ బీజేపీ నేత శివరామ్ భార్యతో ఫోన్లో మాట్లాడినట్లు కాంగ్రెస్ చెప్పింది. బీజేపీలోకి రావడం లేదా ఓటింగ్‌కు గైర్హాజరవడం చేస్తే రూ.15 కోట్లు ఇస్తామంటూ బీజేపీ నేత ఆఫర్ ఇస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది.కానీ ఇప్పుడీ ఎపిసోడ్‌కు శివరామ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఆ ఫోన్లో మాట్లాడింది తన భార్య కాదని ఓ ఫేస్బుక్ పోస్ట్‌లో శివరామ్ స్పష్టంచేశారు. అసలు ఏ బీజేపీ నేత తననుగానీ, తన భార్యనుగానీ సంప్రదించలేదని ఆయన చెప్పారు. అయితే తామెప్పుడూ ఫోన్లో మాట్లాడింది శివరామ్ భార్య అని చెప్పలేదంటూ కాంగ్రెస్ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది.ఆ గొంతు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన మహిళది. మా పార్టీ అభిమాని అయిన ఆమె.. ఈ ఆడియో క్లిప్‌ను మాకు ఇచ్చింది. మా ఎమ్మెల్యేలతో బేరసారాలు నడుపుతున్న బీజేపీ నేతలను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి వీఎస్ ఉగ్రప్ప అన్నారు. అయినా ఆ మహిళ ఎవరన్నది ముఖ్యం కాదని, ఆమెకు డబ్బు ఆఫర్ చేశారా లేదా అన్నదే పాయింట్ అని ఆయన చెప్పారు. ఇలాంటివి 20 ఆడియో క్లిప్పులు తమ దగ్గర ఉన్నట్లు కాంగ్రెస్ చెబుతున్నది.
Tags:Fakes all the bargains

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *