నాలుగు జిల్లాల ఇన్ ఛార్జ్ గా ఫకృద్ధిన్‌షరీఫ్
పుంగనూరు ముచ్చట్లు:
రాయలసీమలోని నాలుగు జిల్లాల మైనార్టీ సెల్ జోనల్ ఇన్ ఛార్జ్ గా పట్టణానికి చెందిన ఫకృద్ధిన్‌షరీఫ్‌ను నియమించడంపై పలువురు ఆయనను అభినందించారు. మంగళవారం చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లా లకు ఇన్‌చార్జ్గా నియమితులైన ఫకృద్ధిన్‌షరీఫ్ మాట్లాడుతూ తనను నియమించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు అన్ని విధాలుగా అవగాహన కల్పించి , వైఎస్సార్‌సీపీని బలోపేతం చేస్తామన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీ సాధించడంలో మైనార్టీల పాత్ర కీలకం చేస్తామన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అర్షద్‌అలి, త్రిమూర్తిరెడ్డి, లక్ష్మణ్‌రాజు, ఇబ్రహిం, జవహార్, అఫ్సర్, అస్లాంమురాధి, రాజేష్, నవాజ్, అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Tags: Fakhruddin Sharif is in charge of four districts
