Running pasidi

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

Date:15/07/2020

ముంబై ముచ్చట్లు:

బంగారం ధర తగ్గింది. నిన్న పెరిగిన పసిడి ధర ఈరోజు దిగొచ్చింది. పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 క్షీణించింది. దీంతో ధర రూ.51,170కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.46,910కు క్షీణించింది.పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. దీంతో ధర రూ.52,120కు తగ్గింది.

 

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.12 శాతం దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1811 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.78 శాతం పెరుగుదలతో 19.68 డాలర్లకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 క్షీణించింది. దీంతో ధర రూ.47,750కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.100 తగ్గుదలతో రూ.48,950కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.90 తగ్గింది. రూ.52,120కు దిగొచ్చింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

 

1.10 లక్షల సీట్లకు అనుమతులు జారీ

Tags:Falling gold and silver prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *