Natyam ad

రాజధాని అంశంపై మంత్రుల తప్పుడు ప్రచారం

-మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ ఫైర్

విశాఖపట్నం ముచ్చట్లు:


రాజధాని అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.హైకోర్టు విధించిన గడువు తేదీలపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, దీన్ని ప్రభుత్వానికి అనుకూలమని ఏవిధంగా ప్రచారం చేసుకుంటారని ప్రశ్నించారు. విశాఖలో అధికార పార్టీ నేతల గుప్పిట్లో వందల ఎకరాల భూములున్నాయని, వాటి విలువ పడిపోకుండా ఉండేందుకే రాజధాని డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.ప్రజలను మభ్యపెట్టే దిశగా ప్రచారం చేస్తున్నారని,అనుకూలంగా కోర్టు మాట్లాడితే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Post Midle

Tags: False propaganda by ministers on capital issue

Post Midle