కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం.. ప్రజలను భయపెట్టొద్దు

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

 

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అనవసరంగా ప్రజలను భయపెట్టొద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో కోవిడ్ రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు భారత్‌లో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. భారత్‌ బయోటెక్‌కు వ్యాక్సిన్‌ అడ్వాన్స్‌ కింద రూ.1500 కోట్లు కేటాయించామని తెలిపారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను 15 రోజుల్లోనే అధిగమించామన్నారు. తెలంగాణలో 46 ఆస్పత్రులకు 1400 వెంటిలేటర్లు ఇచ్చామన్నారు. దీపావళికి 80 కోట్ల మందికి అదనంగా 5 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: False propaganda on Corona Third Wave .. Do not scare people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *