Natyam ad

నీటి సమస్య ఉందంటు అసత్య కథనాలు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని భీమగానిపల్లె పంచాయతీ లక్ష్మీపురంలో నీటి సమస్య ఉందంటు ఈనాడులో అసత్య కథనం ప్రచురించారు. ఆదివారం దీనిపై ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి లక్ష్మీపురం ను సందర్శించారు. ఈనాడులో ఫోటో పెట్టి ప్రచురించిన ప్రాంతానికి ఎంపీపీ వెళ్లి విచారించగా నీటి సమస్య లేదని, నీరు వృధాగా పోతూ ఉంటుందని పరిశీలించుకోవాలని గ్రామస్తులు తెలిపారు. దీనిపై భాస్కర్‌రెడ్డి  మాట్లాడుతూ  మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి ఇంటిని కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. మండలంలో నీటి సమస్య లేదని స్పష్టం చేశారు. ఎల్లో మీడియాలో కావాలనే అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని, ఇది మంచిపద్దతి కాదని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకునివార్తలు రాయాలని సూచించారు.

 

Post Midle

Tags: False stories that there is a water problem – MPP Bhaskar Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.