నిట్టనిలువునా చీలిపోతున్న కుటుంబపార్టీలు

Date:15/09/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
కుటుంబ పార్టీల్లో చిచ్చు ఎప్పటికైనా తప్పదా? ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ విభేదాలు పార్టీనే కొంప ముంచేట్లుగా కన్పిస్తున్నాయి. ఫ్యామిలీలో అందరూ పార్టీని ఏలాలనుకుంటారు. అది సర్వ సాధారణం. కాని రాజకీయాల్లో అది సాధ్యం కాదు. చివరకు కుటుంబంలో రేగిన విభేదాలు ఆ పార్టీకే శాపంగా మారనున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీని తీసుకున్నా, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్, అదే రాష్ట్రంలోని రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజ్ వాదీ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు, బాబాయ్ శివపాల్ యాదవ్ కు పడటం లేదు. శివపాల్ యాదవ్ ఏకంగా కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేశారు. పార్టీలో తనకు, తన వర్గానికి సరైన ప్రాధాన్యం లభించడం లేదన్నది శివపాల్ ఆరోపణ. తన సోదరుడు ములాయం సింగ్ స్థాపించిన పార్టీని అఖిలేష్ సర్వ నాశనం చేస్తున్నారని, ఆయన ఏకపక్ష పోకడలతో పార్టీలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, పార్టీని బతికించుకోవాలంటే తిరిగి ములాయంకు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఎంతకాదనుకున్నా శివపాల్ యాదవ్ కొత్త పార్టీ పెట్టినా, అఖిలేష్ కు సహకరించక పోయినా చివరకు నష్టపోయేది అఖిలేష్ మాత్రమే. అందుకే ములాయం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీహార్ లో లాలూ కుటుంబంలోనూ చిచ్చురేగింది. లాలూ ప్రసాద్ యాదవ ప్రస్తుతం గడ్డి కుంభకోణంలో జైలులో ఉన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ సత్ఫలితాలను సాధించింది. రాష్ట్రీయ జనతాదళ్ ను లాలూ చిన్న కుమారుడైన తేజస్వీయాదవ్ నడుపుతున్నారు. ఆయన కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుంది. రబ్రీదేవి మద్దతు కూడా తేజస్వీయాదవ్ కే ఉంది.
దీంతో పెద్దకుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్ మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల పై చర్చించేందుకు మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన ముఖ్య సమవేశానికి తేజ్ ప్రతాప్ యాదవ్ గైర్హాజరయ్యారు. తేజ్ ప్రతాప్ యాదవ్ కన్నా తేజస్వీ యాదవ్ కు పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ పట్టు ఉండటంతోనే ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు లాలూ యాదవ్. అయితే తమ్ముడి విషయంలో తనకు ఎటువంటి అపోహలు లేవని, తేజస్విని ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని ఆయనపైకి చెబుతున్నా లోలోపల రగిలిపోతున్నారన్నది వాస్తవం.
బీహార్ లని మరో ప్రాంతీయ పార్టీ అయిన లోక్ జన్ శక్తి పార్టీలో కూడా కుటుంబ కలహాలు బయటకు వచ్చాయి. ఇక్కడ లోక్ జన్ శక్తి కొన్ని ప్రాంతాలకే పరిమితం. కొన్ని సీట్ల వరకే దాని ప్రభావం. అయినా ఆ పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వాస్తవానికి లోక్ జనశక్తి పార్టీలో ప్రధాన పదవులన్నీ పాశ్వాన్ కుటుంబానివే. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ జుమూయి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. మరో కుమారుడు పశుపతికుమార్ పార్టీ బీహార్ అధ్యక్షుడిగా ఉన్నారు. మేనల్లుడు ప్రిన్స్ రాజ్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్ మరో సోదరుడు రాంచంద్ర పాశ్వాన్ ఎంపీగా ఉన్నారు. దీంతో పాశ్వాన్ కుమార్తె ఆషా పాశ్వాన్ కు మాత్రం ప్రాధాన్యత లేదు. దీంతో ఆమె తిరుగుబాటుకు దిగారు. వచ్చే ఎన్నికల్లో తాను తండ్రిపైనే పోటీ చేస్తారని ప్రకటించారు. ఇలా ప్రాంతీయ పార్టీల్లో తలెత్తుతున్న కుటుంబ విభేదాలు ఆ యా పార్టీలను బజారున పడేస్తున్నారు. ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని నింపుతున్నాయి.
Tagas:Family members of the knees are split

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *