ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

Famous actor and director Captain Raju is dead

Famous actor and director Captain Raju is dead

Date:17/09/2018

కొచ్చి ముచ్చట్లు:

ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు ( 68 ) కన్ను మూశారు. సోమవారం తెల్లవారుజామున కొచ్చి లోని తన నివాసం లో గుండె పోటుతో మృతి చెందారు. ఇదే రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1981 లో వచ్చిన ‘రక్తం’ చిత్రంతో రాజు తెరంగ్రేటం చేసారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు ఆయన 500 చిత్రాల్లో నటించారు.

 

ఆయన కొంత కలం ఆర్మీ లో పనిచేయడంతో అందరు కెప్టెన్ రాజు అని పిలుస్తుండేవారు. తెలుగులో వెంకటేష్ నటించిన శత్రువు సినిమా, చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు తో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

 

ఆయన ఆఖరిగా 2017 లో వచ్చిన మాస్టర్ పీస్ అనే చిత్రం లో నటించారు. జులైలో రాజు తన కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికా కు వెళుతుండగా విమానములో గుండెపోటు వచ్చింది.దాంతో విమానాన్నిఒమాన్ లోని మస్కట్ కు మళ్లించి అక్కడి నుంచి కొచ్చి కి తరలించారు.కాగా రాజు కు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు.

‘భలే మంచి చౌక బేరమ్‌’ – అక్టోబర్‌ 5 విడుదల 

Tags:Famous actor and director Captain Raju is dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *