Natyam ad

శ్రీవారి దర్శనానికి ప్రముఖులు

తిరుమల ముచ్చట్లు:


తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తడో పులివెందుల ఇంచార్జ్ బిటెక్ రవి, టిడిపి కడప జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి., టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్ రావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….వైసీపీ నాయకుల ఆదాయం పెరుగుతుంటే… రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతుందని ఆరోపించారు. వైసీపీ గవర్నమెంట్ ను గద్దె దింపి టీడీపీ పార్టీకి అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కడప పార్లమెంట్ స్థానంలో నన్ను., పులివెందుల స్థలనంలో బి టెక్ రవిని గెలిపించాలి కోరుకున్నానని…అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి పథంలో నడిపేలా సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకునట్లు వెల్లడించారు. అనంతరం బిటెక్ రవి మాట్లాడుతూ….పులివెందుల అభ్యర్థిగా నన్ను., పార్లమెంట్ అధ్యార్ధిగా శ్రీనివాస్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారని చెప్పారు.శ్రీవారి ఆశీస్సులు తీసుకోని ప్రచారం ప్రారంభింస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జగన్ తన ఆదాయాన్ని పెంచుకుంటున్నాడని….ఇకనైనా సీఎం జగన్ కు మంచి మనస్సు ఇచ్చి…. రాష్ట్రంకు ఆదాయం వచ్చేలా చేయాలనీ స్వామి వారిని ప్రార్ధించానన్నారు.

 

Tags: Famous for darshan of Srivari

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.