Natyam ad

మిథున్ చక్రవర్తి కుమారుడు హీరోగా ‘నేనెక్కడున్నా’ టైటిల్, టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు

హైదరాబాద్ ముచ్చట్లు:

సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు  మిమో చక్రవర్తిని తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాధవ్ కోదాడ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘నేనెక్కడున్నా’. దర్శకుడిగా ఆయనకు కూడా తొలి చిత్రమిది. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు.
‘నేనెక్కడున్నా’ టైటిల్, టీజర్ విడుదల అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ ”టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.

 

 

Post Midle

చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ”జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. ఈ సినిమాతో హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం” అని చెప్పారు.
చిత్ర నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ”సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ చేశాం. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. స్టోరీ, మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్ పూర్తయ్యాక విడుదల తేదీ వివరాలు వెల్లడిస్తాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.

 

 

మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, శయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, సీవీఎల్ నరసింహారావు, రవి కాలే, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర తదితరులు నటించిన ఈ చిత్రానికి డాన్స్ :  ప్రేమ్ రక్షిత్, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, స్టంట్స్ : శంకర్ , మాధవ్ కోదాడ, ఎడిటింగ్ : ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, సంగీతం : శేఖర్ చంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : రాజేష్ ఎస్ఎస్, సహ నిర్మాత : రమణారావు బసవరాజు, సమర్పణ : కె.బి.ఆర్, నిర్మాత :  మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి, స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – డైరెక్షన్ : మాధవ్ కోదాడ.

 

Tags: Famous producer Suresh Babu has released the title and teaser of ‘Nenekkadunna’ with Mithun Chakraborty’s son as the hero.

Post Midle