ప్రముఖ రచయిత్రి యుద్దనపూడి సులోచనరాణి కన్నుమూత

Famous writer Yudanapudi Sulochana Rani passed away

Famous writer Yudanapudi Sulochana Rani passed away

Date:21/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గుండెపోటుతో మృతి చెందారు. కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో సులోచనారాణి మృతి చెందారు. యద్దనపూడి సులోచనారాణి అనేక నవలలు రాశారు. వాటి ఆధారంగా పలు సినిమాలు నిర్మించారు.ఈ విషయాన్ని ఆమె కుమార్తె శైలజ కుటుంబసభ్యులు ధృవీకరించారని సమాచారం. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు తెలుగు సాహితీరంగంలో ఒక ప్రభంనాన్ని సృష్టించాయి. కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో యుద్దనపూడి సులోచనరాణి1940లో జన్మించారు. తన చుట్టూ వున్న జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని ఆమె రచనలు చేశారు. . తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి పాత్రలను సృష్టించారు. భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు. యుద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు – మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసారు.
TAgs:Famous writer Yudanapudi Sulochana Rani passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *