YSRCP పార్టీ కార్యకర్త లకు అభిమానులకు  విన్నపం…!!

అమరావతి ముచ్చట్లు:
 
ఇప్పుడు ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎవరు కూడా….పార్టీ కి కానీ, CM కి కానీ వ్యతిరేకం కాదు..! ఉద్యోగులకు జరుగుతున్న జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తున్నాం.ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కి మీ ఓట్ల మెజారిటి లో సింహ భాగం🦁 ఉద్యోగవర్గం ఉంది. అదంతా పాదయాత్ర లో ఎన్నికల ప్రచారం లో మాకు ఇచ్చిన హామీల వల్లనే… అవి ఏంటో…ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఎంటో మా తరపున ఒక వివరణ…!!అడగకుండానే 27% IR ప్రకటించారు.. ఇంత కావాలి అని ఏ ఉద్యోగస్తుడు అడగలేదు కానీ… 2018 PRC సమయం అని, ఓట్ల కోసం హామీ ఇచ్చారు.ఇప్పుడు అదే IR అప్పట్లో తెలియక ఇచ్చేసాము తిరిగి ఇచ్చేయండి అంటున్నారు.ఆకలి అన్నప్పుడు అన్నం పెట్టి ఇప్పుడు అది కక్కమంటే ఎలా???ఇప్పుడు 27 కాదు 23 ఇస్తాం అన్నారు! దానిలో మరలా.. PRC అమలు ఐన సమయం 2019 జూలై నుండి ఇచ్చిన అమౌంట్ అంతా ఇప్పుడు తిరిగి ఇవ్వాలి అంటున్నారు.ఇది న్యాయమా? అన్యాయమా???ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే.. monetary బెనిఫిట్స్ 2020 ఏప్రిల్ 1 నుండి అమలు అవుతాయి.. *కానీ మా దగ్గర తిరిగి తీసుకునేది 01.07.2019 నుండి..ఇప్పుడు మేము తిరిగి ప్రభుత్వానికి కట్టవలసిన 12% +4% = 16%..
మాకు govt తీర్చవలసిన అప్పు లో cut చేసుకుంటాం అంటున్నారు.జీతం తగ్గలేదు అంటున్నారు..
IR 27% నుండి 23% కి,HRA 20% నుండి 8% కి తగ్గిస్తే జీతం పెరుగుతుందా తగ్గుతుందా?
 
 
 
DA లు ఇచ్చారు కదా అంటే… DA సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాటిలోకి వస్తుంది.. అంతే కానీ… అవి ఉద్యోగుల హక్కు… బిక్ష కాదు!CCA తీసి చెత్తబుట్టలో వేశారు… ఎందుకు తీసారో ఎవరికి తెలియదు..???7 DA లు ఇచ్చాం, అందులో 5DA లు ఒకేసారి ఇచ్చాం అంటున్నారు.. అన్ని DA లు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచింది ఈ govt మాత్రమే… చరిత్రలో ఎవరు లేరు.ఇవి మా హక్కు…మా ముందు తరాలు గత ప్రభుత్వాలతో మేము పుట్టకముందే పోరాడి తెచ్చుకున్నవి DA, HRA… అవి తీసేసే లేదా తగ్గించే అధికారం ఎవరికీ లేదు.పైగా ఈ 7 DA లు GOVT. ఉద్యోగులకు 2019 నుండి బకాయి(అప్పు) పడింది. వాటిలో ఒకదానికి గత సంవత్సరం ఫిబ్రవరి లో బిల్ చేస్తే ఇంతవరకు మాకు డబ్బులు రాలేదు… పైగా మా అప్పు తీర్చకుండా…వాటికి తిరిగి Income Tax కట్టించుకున్న ఘన చరిత్ర ఈ ప్రభుత్వం సాధించింది…!!ఇందులో ఇంకొక పాయింట్… HRA ఇప్పుడు ఉన్న రేట్స్ కి అనుగుణంగా హౌస్ రెంట్స్ fix చేస్తారు.. అది మా జీతాల లో 20% ఉండేది, దానిని 8% కి ఫిక్స్ చేశారు… జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 1500 నుండి 2000 కి ఇల్లు అద్దెకు దొరుకుతుందా??ఇందులో ఇంకొక అన్యాయం…PRC అమలు అయ్యే డేట్ నుండి ఇప్పటి వరకు తీసుకున్న HRA 20% లో…12% తిరిగి కట్టాలి.. ఇది అన్యాయం కాదా???పెన్షనర్స్, ఇప్పటివరకు… 70సంవత్సరాలు వయసు దాటిన వారు 10%, 75సంవత్సరాల వయసు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ పొందే వారు.
ఇప్పుడు ఆ వెసులుబాటును రద్దు చేసి, 80 సంవత్సరాలనుండి 20%అదనపు పెన్షన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది విడ్డూరంగ లేదా? సగటు మనిషి 80సంవత్సరాలు జీవించగలడా???పెన్షనర్ మరణిస్తే… దహనసంస్కారలకు ఇచ్చే మొత్తం 15000 రూపాయలు లేదా ఒక నెల పెన్షన్ ఇది వరకు ఇచ్చేవారు. అది కూడా రద్దు చేసి.. ఒకే మొత్తం 20000రూపాయలు అని సీలింగ్ పెట్టారు. ఇది సమంజసమా?? ఆఖరికి మట్టి ఖర్చుల్లో కూడా కోత!!!
 
 
ఫైనల్ గా CPS వారం లో రద్దు అన్నారు.. కానీ వారానికి ఎన్ని సంవత్సారాలు అనేది చెప్పలేదు… ఇప్పటి వరకూ అతీ లేదు గతీ లేదు.మీరిచ్చిన హామీల అమలు చేయాలి అని మీ అభిమాన వ్యక్తి పార్టీ కి వ్యతిరేకంగా పోరాడితే… ఉద్యోగులు అంటే చులకనగా మాట్లాడుతున్నారు..ఎన్నో కష్టాలు పడితే కానీ ఈ ఉద్యోగాలు రాలేదు. వొళ్ళు నలగకుండ ప్రభుత్వం ఇచ్చే ఉచితాలు తీసుకుని కూర్చొని తినే వారికేం తెలుసు ఉద్యోగం విలువ…!!!ఉద్యోగులు అంటే ఉదయం నీ ఇంటి ముందు చెత్త ఎత్తే వారి దగ్గర నుండి RTC, ELECTRIC, WATER, POLICE ఆఖరికి నీ birth, డెత్ సర్టిఫికెట్ ఇచ్చేది, నీ ఇల్లు వాకిలి నీదే అని చెప్పే డాక్యుమెంట్స్ ఇచ్చేది, ఆఖరికి మంత్రి, ముఖ్యమంత్రికి బయటకు రావాలన్నా, వాళ్ళకి సమాచారం తెలియాలి అన్నా ఉద్యోగులే చెయ్యాలి.62 years రిటైర్మెంట్ ఉద్యోగులకు ఎవరికీ కూడా ఇష్టం లేదు… మేము అడగనూ లేదు. దీని వల్ల సర్వీస్ లో ఉన్నవారికి పదోన్నతులు రావు…మాకంటే ఎక్కువ నష్టపోయేది నిరుద్యోగ యువత. ఇప్పటికే రాష్ట్రం లో దేశంలో యువత ఉపాధి, ఉద్యోగాలు లేక ఎంతో దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు..
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Fans appeal to YSRCP party workers … !!

Natyam ad