https://www.telugumuchatlu.com/100-days-for-sundarakanda-recitation-in-thirumala/

సీఆర్‌ఫిఎఫ్‌ జవాను శ్రీనివాసులుకు వీడ్కోలు

– అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
– నివాళులర్పించిన సబ్‌కలెక్టర్‌ జాహ్నవి
– శోక స్యద్రంలో కాటిపేరి

Date:18/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలోని అనంతనాగ్‌ జిల్లా లేతపుర ప్రాంతంలో సీఆర్‌పిఎఫ్‌ జవానుగా విధులు నిర్వహిస్తూ మృతిచెందిన సీఆర్‌పిఎఫ్‌ జవాను టి.శ్రీనివాసులు(27)కు గురువారం రాత్రి వీఢ్కోలు పలికారు. మృతుని స్వగ్రామమైన కాటిపేరిలో అధికార లాంఛనాల నడుమ సీఆర్‌పిఎఫ్‌ అధికారులు శవపేటికను జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంనుంచి ప్రత్యేక విమానం ద్వారా బెంగళూరుకు తీసుకొచ్చారు. అక్కడినుంచి ప్రత్యేక వాహనం ద్వారా కాటిపేరికి తీసుకొచ్చి సందర్శనార్థం మృతుని స్వగ్రామంలో ఉంచారు. మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, తహసీల్దార్‌ మురళి , స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు శ్రీనివాసుల శవపేటిక వద్ద పుష్పగుచ్చంతో జవాన్‌ జోహార్‌ అంటూ సెల్యుట్‌ చేశారు. అనంతరం అధికారిక లాంఛనాల నడుమ హిందూ సాంప్రధాయ రీతిలో ఘనంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. శ్రీనివాసులు ఇక లేడని తెలియడంతో బంధువులతోపాటు స్నేహితులు,కుటుంబసభ్యుల ఆర్థనాదాలు కలిచివేశాయి.

తిరుమలలో సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి 100 రోజులు

Tags: Farewell to CRFF Javanese Srinivasans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *