గవర్నర్ కు ఘనంగా వీడ్కోలు
అమరావతి ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ కు మంగళవారం ఉదయం విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి రవితేజ పదిరి, లాయర్స్ వాయిస్ మాస పత్రిక ఎడిటర్ ఎన్ రాజారెడ్డి ల అధ్వర్యంలో పూల మొక్కను బహూకరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రవితేజ, రాజారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ విస్వచందన్ హారిభూసన్ రాష్ట్ర అభివద్ధికి పాటుపడారని, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంచి సందాన కర్తగా వ్యవహరించారని తెలిపారు. అదే విధంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా కూడా మంచిగా రాణించాలని జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని తలచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు ఖాజా మోహినుద్దిన్, దివ్య ప్రసాద్, సి ఐ ఐ ప్రతినిధి ఎన్. పవన్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Farewell to the Governor

