ఉరేసుకొని రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్  ముచ్చట్లు :
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని  నార్నూర్  మండలంలోని తాడిహత్నూర్ గ్రామానికి చెందిన చవాన్ అరవింద్ (36) అనే గిరిజన రైతు ఉరి వేసు కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు…అరవింద్ కు నాలుగెకరాల సొంత పట్టా భూమి ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు తాడిహత్నూర్ బ్యాంకులో రూ.90 వేల పంటరుణం తీసుకొని ఏటా వడ్డీ కడుతున్నారు. ఈ ఏడాది రైతుబంధు సొమ్మును బ్యాంకు వారు వడ్డీ కింద తీసుకున్నారు. దీంతో ప్రస్తుత సాగు ఎలా చేయాలా అని మధనప డుతూ  ఇంట్లో ఉరి వేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు… శవాన్ని ఊట్నూర్ ప్రభు త్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి భార్య చవాన్ అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలి పారు. అరవింద్ కు  భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Farmer commits suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *