ఐకెపి వద్ద రైతు మృతి
కరీంనగర్ ముచ్చట్లు:
తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామంలోని ఐకెపి వద్ద ట్రాక్టర్ మీద నుంచి వెళ్లి ఓ రైతు మృతి చెందాడు. సర్పంచ్ ఉమారాణి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉప్పులేటి మొండయ్య (60) ఐకెపి వద్దకు రెండు రోజుల క్రితం తన ధాన్యాన్ని తీసుకొని వచ్చాడు. శనివారం వేకువ జామున 3’గంటలకు వడ్లను తూకం వేశారు. ఉదయం లోడింగ్ చేస్తాననడంతో మొండయ్య ఐకేపీ వద్ద తాడిపత్రి కప్పుకుని నిద్రపోయాడు. ఈ క్రమంలో ఐకెపి నుంచి వడ్ల లోడుతో రైస్ మిల్ కు వెళ్లేందుకు ట్రాక్టర్ డ్రైవర్ వాహనం తీస్తుండగా మొండయ్యను గమనించకుండా అతని మీద నుంచి ఎక్కించాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్ఎండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు.
Tags: Farmer dies at IKP

