ఐకెపి సెంటర్ లో రైతు మృతి
-నెల రోజులకు పైగా పడిగాపులు
న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన
నల్గోండ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలో గుయ్యం ఎల్లయ్య(52) అనే రైతు నెల రోజుల క్రితం ఐకెపి సెంటర్లో ధాన్యం పోశాడు. మధ్యాహ్నం సమయంలో వడ్ల కుప్ప వద్దనే అకస్మాత్తుగా మృతి చెందాడు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఐకెపి సెంటర్లో గ్రామస్తులు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నెల రోజులకు పైగా ఐకెపి సెంటర్ లో ఉన్న వడ్ల కుప్ప వద్ద కాపలా కాస్తున్నాడని,ఎండకు తట్టుకోలేకపోయాడని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేసింది.రోజు ఐకెపి సెంటర్ చుట్టూ తిరిగేవాడని వడ్ల రాశి వద్దనే ఎండకు తట్టుకోలేక అస్వస్థతకు గురై చనిపోయాడని మృతుని బంధువులు తెలిపారు.ధాన్యం ఎప్పుడు కొంటారు తెలియని పరిస్థితి ఉందని ఎవరు పట్టించుకోలేదని వారు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

Tags: Farmer dies in IKP center
