Date:23/01/2021
సంగారెడ్డి ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదిక ను మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతులను సంఘటితం చేయడానికే రైతు వేదికలు నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ కృషి తో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి మారింది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 35 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేస్తుంది. 600 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 2506 రైతు వేదికలు నిర్మించాం. సేంద్రియ పద్ధతులలో వ్యవసాయ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఫాం ఆయిల్స్ సాగు తెలంగాణ రాష్ట్రం కేంద్రం గా మారబోతుంది. రైతులకు లాభసాటి వ్యవసాయమ్ కోసం రైతు వేదికల్లో చర్చలు జరిగాయి.
నందిగామ రైతు వేదిక జిల్లా కు ఆదర్శంగా కట్టారని మంత్రి అన్నారు.ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిచ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం కు మేలు చేయడానికి రైతు వేదికలను నిర్మిస్తున్నాము. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న పఠాన్ చేరు ప్రాంతంలో కూరగాయలు, పూల సాగు చేయాలి. సన్నబియ్యం సాగు పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేశారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిత్యం కృషి చేస్తారని అన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Farmer forums are for farmers’ integration