Natyam ad

వింత పురుగు కుట్టడంతో రైతు ఆసుపత్రి పాలు

ఖమ్మం ముచ్చట్లు:


పత్తి చేనులో వింత పురుగు కుట్టడం వల్ల రైతు ఆసుపత్రి పాలైన సంఘటన ఖమ్మం జిల్లాలో తోటి చేసుకుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు పశువులకు గడ్డి తీసుకొచ్చేందుకై పొలం గట్ల పైన గడ్డి కోస్తుండగా పత్తి చేనులో పత్తి చెట్టు ఆకు కింద ఉన్నటువంటి  పురుగు కుట్టడం వల్ల స్వల్ప రక్త స్రావం కావడం తో పాటు,ఒళ్లంతా మంటలు రావడంతో హుటాహుటిన ఆర్ఎంపి వైద్యుడు వద్దకు వెళ్లగా విషపురుగు కుట్టింది వెంటనే ఖమ్మం ఆసుపత్రికి వెళ్ళమని సూచించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.24 గంటలు గడిస్తే కానీ ఏదయింది చెప్పలేమని వైధ్యులు అంటున్నారని, ఒళ్లంతా మంటలు వస్తున్నాయని రైతు ఆందోళన చెందుతున్నాడు.

 

Tags: Farmer hospitalized after being bitten by a strange insect

Post Midle
Post Midle