రైతుబాంధవుడు కేసీఆర్

– కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాల అమలు

– రైతును రాజును చేయడమే టీఆరెస్ లక్ష్యం

– మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్

పెద్దపల్లి    ముచ్చట్లు:

రైతు కష్టాలు తెలిసిన రైతుబాంధవుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ కొనియాడారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతుబంధు పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేస్తున్న సంధర్భంగా మంగళవారం రత్నాపూర్ రైతువేదిక వద్ద టీఆరెస్ మండల పార్టీ అధ్యక్షుడు శెంకేశి రవిందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. రైతును రాజును చేయడమే టీఆరెస్ పార్టీ లక్ష్యమని అందులో భాగంగా టీఆరెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పకడ్బంధీగా అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించి రాష్ట్ర ప్రజలకు, రైతులకు పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న టీఆరెస్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలువాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరునిపై ఉందని, టీఆరెస్ కు అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కన్వీనర్ మేదరవేన కుమార్ యాదవ్, స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు దర్ముల రాజ సంపత్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పాశం ఓదెలు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లెల కిరణ్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, సెంటినరీ కాలనీ పట్టణ అధ్యక్షుడు కాపుర బోయిన భాస్కర్, అల్లం తిరుపతి, చలమయ్య, రైతుబంధు గ్రామ అధ్యక్షులు సాగర్ల తిరుపతి, పంజా అరుణ్, వార్డు సభ్యులు కొవ్వూరు సురేష్, బొంగరాల రవి, గెల్లు స్రవంతి కృష్ణ, బంక్ మల్లేష్, సంధవెన కుమార్, జక్కుల చందన్, ఇజ్జగిరి సంపత్, మెడ కొండ లక్ష్మయ్య, మందల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Farmer KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *