ఎలుగుబంటి దాడిలో రైతు మృతి

శ్రీకాకుళం ముచ్చట్లు:


శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుల ఎలుగు బంటి  మరోసారి దాడి చేసింది. ఎలుగు దాడిలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స అందిం చేందుకు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమా చారం. ఎలుగు బంటి దాడులు వరుసగా జరుగుతున్నా అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయం టూ  స్దానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పొలం పనులకు వెళ్లాలన్నా, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా భయంగా ఉందని చెబుతున్నారు. ఎలుగుబంటి ఎక్కడ తమపై దాడి చేస్తుందోనన్న భయమే వారిని ఏ పని చేయకుండా చేస్తుందని వాపోతున్నారు.ఎలుగుబంటి దాడిలోవజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఎలుగుబంటి చేసిన దాడిలో కలమట కోదండ రావు అనే అన్నదాత మృతి చెందాడు. ప్రతిరోజూ లాగే ఉదయం నిద్ర లేచిన కోదండ రావు గ్రామ సమీపంలో ఉన్న తోటకు వెళ్తుండగా సమీప పొదల్లో దాగివున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. ఎలుగు దాడితో ప్రాణ భయంతో ఆయన గట్టిగా కేకలు వేశారు. దగ్గర్లో ఉన్నవారు అక్కడికి వచ్చేసరికి ఎలుగు అక్కడ నుండి పారిపోయింది. ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Tags: Farmer killed in bear attack