Natyam ad

ఎలుగుబంటి దాడిలో రైతు కి తీవ్రగాయాలు

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామ శివారులో రైతు యల్లప్ప పై ఎలుగుబంటి దాడి చేసింది. పొలం పనులకు వెళుతున్న రైతు యల్లప్పపై ఎలుగు బంటి దాడిలో తీవ్రంగా గాయపరుస్తుండగా  గ్రామస్తులు కేకలు వేయగా అడవిలోకి పరుగులు తీసింది. రైతు యల్లప్ప పొట్ట భాగంలో తీవ్రగాయాలు కావడంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు  108 లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుగు బంట్లు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొలేదని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి ఎలుగు బంటి ధాడుల నుంచి కాపాడలని వారు కోరుతున్నారు.

 

Tags: Farmer seriously injured in bear attack

Post Midle
Post Midle