రైతు సంక్షేమమే ధ్యేయంగా..రైతుల ప్రతి అడుగులో ప్రభుత్వం- సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
గుంటూరు ముచ్చట్లు:
ప్రతి అడుగులో రైతులకు అండగా తమ ప్రభుత్వం నిలుస్తున్నదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అవినీతి లేకుండా రైతులు ఇష్టపడే పరికరాలే పంపిణీ చేస్తున్నామని, వారికి ఇష్టం వచ్చిన ట్రాక్టర్ కొనుగోలు చేసుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చినామన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ట్రాక్టర్ డీలర్లతో కుమ్మక్కై కమీషన్లకు కక్తుర్తి పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. అప్పుడు ట్రాక్టర్ల పంపిణీలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు.రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,750 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో రైతులకు పరికరాలు, పురుగుమందులు, ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు గ్రూపులుగా ఏర్పడితే వారికి వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్‌తో పాటు వివిధ పరికరాలు సబ్సిడీ కింద అందచేస్తున్నట్లు తెలిపారు. రూ. 2,016 కోట్లు ఖర్చు పెట్టి ట్రాక్టర్లు అందజేస్తున్నామని, 3,820 ట్రాక్టర్లతో పాటు 1120 వివిధ పరికరాలను ఇవాళ రైతులకు అందజేస్తున్నట్లు చెప్పారు.
అలాగే,5,260 గ్రూపుల రైతుల ఖాతాల్లోకి రూ.590 కోట్ల సబ్సిడీ విడుదల చేయనున్నట్లు జగన్ తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ఉపయోగపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో సీఎం జగన్ పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. అనంతరం పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న హరిత నగరాలు’ నమూనాను జగన్ ఆవిష్కరించారు. జిందాల్ ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. కొండవీడు హెలిప్యాడ్ వద్ద మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎంపీ అయోధ్య రామిరెడ్డి,ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కలెక్టర్ ఎల్.శివశంకర్ తదితరులు సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

Tags: Farmer welfare is the goal..Government at every step of the farmers- CM YS Jaganmohan Reddy
