పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం

Farmer worms drug suicide attempt at Punganur police station

Farmer worms drug suicide attempt at Punganur police station

– భూతగాదాలలో న్యాయం జరగలేదని
– పరిస్థితి విషమం

Date:21/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

రైతు తన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ప్రతి రోజు తిరిగినా న్యాయం జరగకపోవడంతో మనస్థాపానికి గురై పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బైరేమంగళంకు చెందిన వెంకటేష్‌(60)కు భార్య, ఇద్దరు కుమారైలు, కుమారుడు ఉన్నారు. తన తండ్రి ద్వారా 19 ఎకరాల భూములు ఉంది. ఇలా ఉండగా సదరు భూములపై చిన్నాన్న రామకృష్ణ, కుమారులైన గోవిందు, పాపన్న, శ్రీనివాసులు, వెంకట్రమణ కలసి కోర్టులో కేసులు దాఖలు చేశారు. ఇలా ఉండగా సదరు గోవిందు, రామకృష్ణలు భూమిలోకి రానివ్వకుండ అడ్డుకుని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులకు గత పది రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఈనెల 9న చిత్తూరుకు వెళ్లి స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేసి, చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా ఉండగా గోవిందు, రామకృష్ణ కలసి వెంకటేష్‌ను, వారి కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేసి బెదిరించడంతో పోలీసులకు మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శనివారం తిరిగి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిని కలిసేందుకు వచ్చాడు. ఎస్‌ఐ చిత్తూరులో క్రైమ్‌ మీటింగ్‌కు వెళ్లాడని పోలీసులు తెలపడంతో ప్రతి రోజు తిరుగుతున్న తనకు ఇక న్యాయం జరగదని తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేష్‌ స్టేషన్‌లోనే పురుగుల మందుతాగేశాడు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వెంకటేష్‌ను మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు 108లో తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో రోదించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.

 షర్మిలకు కీలక బాధ్యతలు

Tags: Farmer worms drug suicide attempt at Punganur police station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *