గొల్లపల్లిలో ఆలయ భూముల కోసం రైతుల అందోళన
నూజివీడు ముచ్చట్లు:
నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయ భూముల పరిరక్షణకు సన్న చిన్న కారు రైతులు నడుం బిగించారు. రామదండు పేరుతో ఆలయ భూముల పరిరక్షణకు ఆలయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేసారు. రఘునాథ స్వామి వారి ఆలయ భూముల్లో స్థానికేతరులతో పాటు కొద్దిమంది చేతుల్లోనే వందలాది ఎకరాలు భూములు ఆక్రమణలో ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
బడా రైతుల వద్ద నుండి, శిస్తు చెల్లించని వారి వద్ద నుండి స్వామివారి ఆలయ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయ భూములను సాగు చేసుకుంటున్న చిన్న రైతులకు అడ్డు వస్తున్న నియమ, నిబంధనలు పెద్ద రైతులకు వర్తింపవా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిరసన ప్రదర్శన చేస్తున్న రైతుల గోడు పట్టించుకోకుండా, కార్యాలయానికి తాళాలు వేసి అధికారులు. వెళ్లిపోయారు. తమ సమస్య పరిష్కారం కాకుంటే సబ్ కలెక్టర్ ను ఆశ్రయించనున్నట్లు రైతులు అంటున్నారు.
Tags; Farmers’ agitation for temple lands in Gollapally

