మదనపల్లెలో రైతుల అందోళన

చిత్తూరు  ముచ్చట్లు:
దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లెలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై రైతాంగం రోడ్డెక్కారు. మార్కెట్ ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వీరికి సిపిఎం నాయకులు శ్రీనివాసులు మద్దతు పలికారు. గంటపాటు రహదారిపై వాహనాలు నిలచిపోవడంతో పట్టణ సిఐలు నరసింహులు, ఈదుర్ బాషా అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో రైతులు, సిపిఎం శ్రీనివాసులు వాగ్వివాదం చేశారు. సిఐ నరసింహులు ఎమ్మెల్యే నవాజ్ బాషా, డియస్పీ రవిమనోహరాచారి తో సంప్రదించి దర్నా విరమింపజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జాక్ పాట్ విధనం రద్దు చేయాలని, కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, వ్యాపారులు, మండి యజమానులు కుమ్మకై రైతులకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. తక్కువ ధరలు ఇవ్వడం, జాక్ పాట్ పేరుతో రైతులకు మోసం చేయడం జరుగుతోందని, టమోటా మార్కెట్ సెక్రటరీ రైతుల తీవ్ర అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. కనీసం రైతులను పట్టించుకోవడా సెక్రటరీ తన స్వలాభం చేసుకుంటున్నాడని, మార్కెట్ లో రైతులకు కనీస సదుపాయం కల్పించడం లేదన్నారు.  ఎన్నో ఏళ్లుగా టమోటా మార్కెట్ నమ్ముకుని  వ్యాపారులు చేసే వారికి  స్థానిక లారీ అసోసియేషన్ సభ్యులు రాకుండా పట్టుపట్టడం, చందా వసూలు చేయడం, వ్యాపారులు లారీ యజమానుల మధ్య వివాదం ముదిరింది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Farmers’ agitation in Madanapalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *