Natyam ad

ఎమ్మెల్యే పై రైతన్న ఆగ్రహం

అనపర్తి ముచ్చట్లు:

ధాన్యం కొనుగోలు పై రైతుల ఆవేదన కథనాలకు ప్రభుత్వం స్పందించింది.  రాష్ట్రంలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి సావరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్, అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కి రైతుల నుండి చుక్కెదురియింది.  ప్రభుత్వం చేపడుతున్న ఏ ఒక్క సంక్షేమ పథకం కౌలు రైతులకు అందడం లేదని రైతులు, కౌలు రైతులు గుర్తించి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని సాక్షాత్తు జిల్లా జాయింట్ కలెక్టర్ ని ప్రశ్నించి తన ఆవేదనను కౌలు రౌతు వెలిబుచ్చాడు.

 

 

ఈ రోజున ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రేటుకి ప్రజలకు బియ్యం అందిస్తున్నారా…? అని అడిగిన కౌలు రైతు ప్రశ్నకు ప్రభుత్వం తరఫున జేసీ దగ్గర సమాధానం లేకపోవడంతో…  1200 కు తమ వద్ద బస్తా ధాన్యం కొనుగోలు చేస్తుంటే ఈ రోజున మార్కెట్లో 3000 రూపాయలు పైగా అదే ధాన్యాన్ని బియ్యoగా మార్చి అమ్ముతున్నారన్న ఆ కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేసాడు.  రైతే వెన్నెముక…రైతే రాజు అని చెబుతున్న ప్రభుత్వాలు రైతులను కౌలు రైతులను గుర్తించి వారికి న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు.

 

Post Midle

Tags: Farmer’s anger on MLA

Post Midle

Leave A Reply

Your email address will not be published.