తీవ్ర అందోళనలో రైతులు

పెనుగొండ ముచ్చట్లు:;

 


ఆచంట
మిచౌంగ్  తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా వాతావారణంలో మార్పులు సంభవించడం వలన రైతులు లబో దిబో మంటున్నారు. ఆచంట,పోడూరు, పెనుమంట్ర,పెనుగొండ మండలాల్లో  ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొన్నిచోట్ల ఈదురుగాలులు కారణంగా కోతకువచ్చిన వరిచేలు ఒరిగిపోయాయి. ఇప్పటికే అన్నిచోట్ల ముమ్మరంగా వరికోతలు సాగుతున్నాయి.. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు సంభవించడం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం రాశులపై తారబల్లలు కప్పి ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడుస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాశుల చుట్టూరు వర్షపు నీరు చేరడంతో
ధాన్యం మొలకలు వచ్చి దిక్కు తోచని స్థితిలో ఉన్నామని,తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే  పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్న  రైతులు.ధాన్యాన్ని మిల్లులకు పంపేవరకు ఇబ్బందులు తప్పదంటున్నారు రైతులు.ఈ అకాల వర్షాలకు ఆచంట మండలంలో 550ఎకరాలు పోడూరు మండలంలో 250 ఎకరాలు వరిచేలు నేలకొరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

Tags: Farmers are in dire straits

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *