భారీ వర్షంతో అల్లాడిపోతున్న రైతులు
జగ్గయ్యపేట ముచ్చట్లు:
జగ్గయ్యపేట నియోజకవర్గం లోని రామచంద్రన్నపేట గ్రామంలో గురువారం త్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి రైతులు విలవిలాడిపోయారు. కళ్ళల్లో ఆరబోసిన మిర్చి పూర్తిగా వర్షంతో తడిసి నీటి ముద్దైపోయింది. పంట చేతికి వచ్చిన సమయంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తీవ్ర నష్టపోయామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చికి మంచి ధర పలికిన సమయంలో భారీ వర్షంతో రైతులను వెన్ను విరిచింది. రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు.
Tags: Farmers are shaken by heavy rain

