ఐకేపీ కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు

Date:17/05/2018
వరంగల్ ముచ్చట్లు:
తెలంగాణలో  ఐకేపీ కేంద్రాల వద్ద  రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. అన్నదాతలు వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రానికి ధాన్యం వచ్చిన రెండుమూడు రోజుల్లోనే కాంటాలు పూర్తికావాలని, ఒక్క రోజులోనే నగదు రైతుల బ్యాంకు ఖాతాలో జమ కావాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ధాన్యం అమ్ముదామని తమ మండలంలోని ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాడు.  ఓ రైతు 22 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ధాన్యాన్ని కాంటా వేయలేదు. రోజు ఐకేపీ కేంద్రానికి వెళ్లడం, కాంటా వేస్తారని కాపాలా కాయడం, ఫలితం లేక ఇంటికి తిరిగి రావడం.. ఇదే తంతు. ఇదేంటని ఐకేపీ నిర్వాహకులను అడిగితే.. గోనె సంచులు లేవని, హమాలీలు లేరని సాకులు చెబుతున్నారు. మరో పక్క వాతవరణం చూస్తే.. ఎప్పుడు వర్షం కురుస్తోందనన్న భయం. ఏం చేయాలో తెలియక సతీశ్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇది ఒక్క సతీశ్ సమస్యే కాదు. రాష్ట్రంలో చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అనేక కష్టాలు పడుతున్నారు.  అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి  ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యమో, పని భారమో  తెలియదు గానీ.. నెల రోజులు గడిచినా ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. గన్నీ బ్యాగుల కొరత, కాంటా చేసిన తర్వాత సరుకు రవాణ చేసే లారీలు లేకపోవడం, వ్యవసాయ విస్తరణ అధికారులు పూర్తిగా రైతు బంధు పథకంలో మునిగిపోవడం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నెమ్మదించాయి. నిజానికి నత్తతో పోటీ పడుతున్నాయి. వచ్చే మూడునాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని భారత వాతవరణ సంస్థ  హెచ్చరించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉంచిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Farmers at IKP centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *