ఆధునిక యుగంలో మూలనపడ్డ రైతు రధచక్రాలు
-కనుమరుగైన ఎడ్ల బండి
-పత్తాలేని నాగళ్ళు గుండ్లు
-అన్ని యంత్రాలతోనే
-యువతకు తెలియని వెన్నో
పుంగనూరు ముచ్చట్లు:

శతాబ్దంకాలంగా రైతుల కు వ్యవసాయరంగంలో ఏంతగానో ఉపయాగపడి న ఏన్నోరకాల పనిముట్లు నేడు ఆదరణకోల్పోయింది.ఆదునిక యుగంలో రైతు రధచక్రాలు మూలనపడ్డాయి. ఫలితంగా నేటి యువతకు ఆ వ్యవసాయ పనిముట్లు చిహ్నాలు గా మిగిలిపోనున్నాయి. వివరాలలోకివెళ్ళితే మన తాతల ముత్తాతలు నా టి వ్యవసాయరంగం లో పడిన కష్టం ఆకష్టం నేడు యంత్రాలు చేయడం మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగి స్తుంది .గ్రామీణ ప్రాంతంలో ని ప్రజలు ఎక్కువబాగం వ్యవసాయం పై ఆదారపడి జీవించేవారు. ఉదయంకోడి కూచింది వెహోదలు నిద్రించేదాకా పొలలోగడిపేవారు. పొలందున్నేందుకు ఎద్దులకు కాడి కట్టి నాగలి తో దున్నించేవారు. పంటలు వేసేందుకు రైతులసహాయంతోనేసాగేది.అలాగే పంటల్లో కలుపుతీసేందుకు కొయ్యకు ఇనుప గొత్తులు అమర్చిన పలికి అనే వస్తువుతో చెత్తను తొలగించేవారు. దీనిని గుంటవలు వేయడం,పలికితోలడం అనేవారు. వీటి స్థానంలో ట్రాక్టర్లు, టిల్లర్లు రావడం జరిగింది. అలాగే పండిన పంటను పొలంవద్దనుంచి ఇంటికి తరలించేందుకు ఎద్దులు, బర్రెలను కాడెలుగా అనగా జంటగా కొయ్యబండ్లకు కట్టి వాటిలో వరిపైరు,రాగిపైరు, శెనగచెట్లు,తదితరపంటలను బండ్ల సహాయంతో పంటలను ఇంటికిచేర్చుకునేవారు. వీటికి కూడ ట్రాక్టర్లు, ఆటోలను వినియోగిస్తున్నారు.
అలాగే పండిన రాగి, ఉలవ, ఉద్దులు, జొన్న, సజ్జ పంటను ఒబ్బిడి చేసేదుకు పల్లెలో పెద్దరాతి గుండు కు ఎద్దులన కట్టి దానితో తొక్కించేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లతో తొక్కించడం, లేదా రహదారులపై వాహనాలకు వేయడం జరుగుతోంది. వీటితోపాటు పల్లేలో ప్రతి ఇంటిలోను రోళ్ళు, రోకలి,విసిరేరాయి.పప్పురుద్దేగుత్తి కర్ర,లంటివస్తువులు మనకు కనపడేవి కందిపప్పునుచేయడానికి విసరేరాయిని వాడేవారు.అలగే చెట్నిలు, కారపుపొడిచేయడానికి రోళ్ళలోపదార్థాలు వేసి రోకలి, రుబ్బుగుండుతో దంచడం , రుబ్బడం చేసేవారు. ప్రస్తుతం వీటిస్దానంలో మిక్సిలు, గ్రైండర్లు,రావడంతో ప్రజలు సుఖానికి అలవాటుపడ్డారు. శతాబ్దలుగాఉన్న వస్తువులు నేడు ఉనికికోల్పోతు,చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిపోనున్నాయి. అదేరీతిలో వ్యవసాయరంగంలో టాక్టర్లు, టిల్లర్లు, జెసిబిలు,రావడంతో ఆదునిక వ్యవసాయ రంగందేపై చేయిగామారింది. దీనిద్వార రైతులు పాతపద్దతులకు స్వస్తిపలికారు. యంత్రాలతోనే వ్యవసాయంచేసేందు కు మొ గ్గుచూపుతున్నారు.ఇలాంటి పరిస్దితులలో పురాతనపద్దతులు పూర్తిగా కనుమరుగై చరిత్రలో సాక్ష్యాలు గా మిగిలిపోనున్నాయి.
Tags:Farmer’s Chariots originated in the modern era
