పంట కాలువల అద్వాన పరిస్థితిపై రైతుల ఆందోళన

రాజమండ్రి  ముచ్చట్లు:
 
పంట కాలువలు ల అద్వాన పరిస్థితిలో వున్నాయని రైతులు  నిరసన చేపట్టారు. పంట కాలువల్లో నీరు రావడం లేదంటూ అల్లవరం మండలం బెండమూర్లంక రైతులు  రోడ్డెక్కారు. నారుమడులు వెయ్యండి అంటూ ఒత్తిడి చేసి మరీ ప్రోత్సహించిన అధికారులు రైతుల గోడు పట్టించుకోవడం లేదు.. పంట కాలువల్లో చుక్క నీరు కూడా రాని పరిస్థితి తలెత్తడంతో రైతులంతా అయోమయ పరిస్థితిలో ఉన్నామని అన్నారు. రైతులు అంత కలిసి చందాలు వేసుకుని బాగు చేసుకుందాం అంటే ధాన్యం అమ్మిన డబ్బులు నేటికీ డబ్బులు రాలేదని మండిపడుతున్నారు. అధికారులు వెంటనే పట్టించుకోకపోతే వేసిన నారు మడులను అలాగే వదిలేస్తాం. రబీ ప్రారంభంలోనే నీరు అందకపోతే ముందు ముందు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటూ రైతులు  నిరసన వ్యక్తం చేసారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యానికి బెండమూర్లంక కాలవే ఒక ఉదాహరణ అంటూ ఆరోపించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Farmers’ concern over deteriorating condition of crop canals