రైతుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం-సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
రామసముద్రం ముచ్చట్లు:
రైతుల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సచివాలయం వద్ద రైతులకు స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశాల మేరకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు సకాలంలో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు వ్యవసాయ రంగంలో ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది బత్తెమ్మ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, వెంకటరమణ, వాలింటర్లు రేవతి, రెడ్డెమ్మ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags: Farmers development is the government’s mission-Sarpanch Srinivasulu Reddy
