Farmers dharna on pond aggression

చెరువు దురాక్రమణపై రైతులు ధర్నా

Date:16/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని పుంగమ్మ చెరువులో ఐదు ఎకరాల స్థలాన్ని స్మశానం కోసమంటు ఒక సామాజిక వర్గం ఆక్రమించుకోవడంతో శుక్రవారం రైతులు, ప్రజలు బెంగళూరు రహదారిపై ధర్నా , రాస్తారోకో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణ సమీపంలోని బెంగళూరు రహదారి పై పుంగమ్మ చెరువు ఉంది. ఇలా ఉండగా మార్లపల్లె సమీపంలో పట్టణంలోని ఒక సామాజిక వర్గం స్మశానం కోసం సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని జెసిబిలతో చదును చేసి, మట్టి తోలి ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ఆయ కట్టు రైతులు , ప్రజలు ఈ ఆక్రమణలను నిరశిస్తూ బెంగళూరు రహదారిపై రాస్తారోకో చేసి , నిరసనలు తెలిపారు. విషయం తెలుసుకుని డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు చెరువును పరిశీలించి, రైతులతో చర్చలు జరిపారు. చెరువు ఆక్రమణలను తొలగిస్తామని, దురాక్రమణ దారులపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోను చెరువు ఆక్రమణలకు గురికాకుండ జాగ్రత్తలు తీసుకుంటామని తెలపడంతో ఆందోళన విరమించారు. ఈ ధర్నాలో రైతులు శ్రీనివాసన్‌, ఆంజప్పతో పాటు పుంగనూరు, మార్లపల్లె, సింగిరిగుంట రైతులు పాల్గొన్నారు.

అక్రమ లేఔట్లతో మున్సిపల్‌ ఆదాయానికి గండి

Tags: Farmers dharna on pond aggression

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *