రైతుల పట్టా పాసుపుస్తకాలను వారం రోజుల్లో సరి చేయాలి 

Date:15/04/2019

కామారెడ్డి ముచ్చట్లు :
రెవెన్యూ డివిజన్ అధికారులు మండల రెవెన్యూ అధికారులు వారం రోజుల్లో గ్రామాల వారీగా సందర్శించి రైతుల పట్టా పాసు పుస్తకాలను సరిచేసి 100% దోష రహిత గ్రామాలుగా ప్రకటించాలని జిల్లా పాలనాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు సూచించారు.  ఎల్ ఆర్ యు పి లో భాగంగా డిజిటల్ పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదైన రైతుల నుండి వివరాలు సేకరించి వాటిని డిజిటల్ “ రివోక్ “  ఆప్షన్ ద్వారా సరిచేసి కొత్త పాసుపుస్తకాల పంపిణీకి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. కాసు పుస్తకాల్లో రైతుల ఫోటో , సర్వే నంబర్ , తప్పులను పేజీ నంబర్ ఒకటి నుండి పాసుపుస్తకాల్లో సరిదిద్దాలి అన్నారు. అర్హులైన వారికి సాదాబైనామా , పి ఓ టి భూములకై పరిశీలన జరిపి అర్హులకు అందించాలన్నారు. డిజిటల్ సైన్ చేయని ఖాతాలు ఎల్లారెడ్డి 10 వేలు , బాన్సువాడ 11 వేలు , కామారెడ్డి 17 వేలు ఉన్నాయన్నారు. వేసవి ఎద్దడి దృష్ట్యా మిషన్ భగీరథ ఏజెన్సీలు మెగా ఐ హెచ్ పి గ్రామాలలో నీటి సమస్య వెంటనే పరిష్కరించేలా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామపంచాయతీ నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.          అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పాస్ పుస్తకాలు జిల్లాకు 3500 వచ్చాయన్నారు. పెండింగ్లో ఉన్న 28 వేల ఎకరాల వివాదాస్పద భూములపై అటవి మరియు రెవెన్యూ శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటిపై నివేదిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Tags:Farmers’ graduation should be corrected within a week

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *