రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

Farmers need technology

Date:14/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రస్తుత పరిస్థితులలో రైతులు అనేక మార్పులతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని, లాభసాటి వ్యవసాయాన్ని చేపట్టాలని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ రెడ్డికుమార్‌ అన్నారు. గురువారం ఏవో సంధ్య ఆధ్వర్యంలో రైతులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రెడ్డికుమార్‌ మాట్లాడుతూ రైతులు పండించే పంటలపై ఉత్తమ యాజమాన్య పద్దతులు వాటి మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకుని , ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పొందవచ్చునన్నారు. ఏడి ఓబులేసునాయక్‌ మాట్లాడుతూ రైతులు తమ సమస్యలపై ప్రతి రోజు వ్యవసాయాధికారులతో చర్చించుకుని పంటలపై మెలుకవలు పెంచుకోవాలన్నారు. ఫారంఫాండ్‌ల ద్వారా నీటి వినియోగం, ఆరుతడి పంటలను పండించడం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ గణేష్‌కుమార్‌, డాక్టర్‌ నాగిరెడ్డి, డాక్టర్‌ కిషన్‌తేజ, డాక్టర్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో మార్చి 25న కేసీఆర్ పర్యటన

Tags: Farmers need technology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *