Farmers need to raise awareness on crop production

పంటలసాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలి

– డీడీ మల్లికార్జున

Date:25/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

రైతులు పంటలు పండించడంలో అవగాహన కలిగి, పంటలు సాగు చేయడం అలవర్చుకోవాలని వ్యవసాయశాఖ డిప్యూటి డైరెక్టర్‌ మల్లికార్జున అన్నారు. శుక్రవారం ఏవో సంధ్య ఆధ్వర్యంలో మండలంలోని సుగాలిమిట్ట, పాల్యెంపల్లెలో రైతుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు డీడీ , ఏడి లక్ష్మానాయక్‌ ముఖ్యఅతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఆహార భద్రత పథకం క్రింద రైతులు పండించిన రాగి పంటను పరిశీలించి, పంట పండించే విధానాలపై విచారించారు. అలాగే పాల్యెంపల్లెలో ఉలవలు, వేరుశెనగ పంటలను పరిశీలించి వేరుశెనగ ఒబ్బిడి తరువాత ఉలవ పంటలు చేసుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను ఈక్రాప్‌లో నమోదు చేసుకుని, ప్రభుత్వం అందించే అన్ని విధాల పథకాలను పొందాలన్నారు. లే కపోతే ప్రభుత్వ పథకాలు అందదని తెలిపారు.

వైస్సార్సీపీ యువనాయకుడు బాలు   జన్మదిన వేడుకలు

Tags: Farmers need to raise awareness on crop production

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *