Natyam ad

రోడ్డెక్కిన రైతులు

పామర్రు ముచ్చట్లు:


కృష్ణాజిల్లా పామర్రు మండలంలో రైతులు రోడ్డెక్కారు, రైతు భరోసా కేంద్రంలో పరీక్షించి పంపిన ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు నిరాకరించడంతో , పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిపై ధాన్యం బస్తాలతో రైతులు ధర్నా చేపట్టారు. పామర్రు మండలం అడ్డాడ పరిసర గ్రామాల్లో పండించిన ఖరీఫ్ పంట ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించిన ఆర్ బి కే సిబ్బంది ,  సంచులు ఇచ్చి ఏం మిల్లులకు తోలాలో సూచించారు. ఆర్థిక సిబ్బంది సూచనల మేరకు పంటను అమ్మేందుకు మిల్లుకు వెళ్లగ, ధాన్యం కొనేది లేదంటూ మిల్లర్లు చెప్పడంతో ఏం జరుగుతుందో అర్థం కాక రైతులు అయోమయంలో మునిగిపోయారు. మిల్లుల వద్ద నుండి వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన రైతులకు సరైన సమాధానం లేకపోవడంతో. పండించిన ధాన్యాన్ని దోచుట పట్టుకొని అడ్డాడ గ్రామంలోని పామర్రు కత్తిపూడి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.రైతుల ఆందోళనలతో రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ ట్రాఫిక్ నిలిచిపోయింది. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళన నిర్మించేది లేదని తెగేసి చెప్పడంతో, చేసేది లేక పోలీసులు అధికారులకు సమాచారం అందించారు.పంట చేతికొచ్చి పది రోజులైన ధాన్యం కోనకుంటే ఎం చేయాలని అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆరుగాలం  కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలంటే రైతు భరోసా కేంద్రం, మిల్లర్ల మధ్య నలిగి పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Farmers on the road

Post Midle
Post Midle