వైసిపి పాలనలో రైతులు సుభిక్షం

Farmers prosper during the YCP regime

Farmers prosper during the YCP regime

Date:14/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

వైసిపి పాలనలోరైతులు సుభిక్షంగా ఉన్నారని మధనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. రామసముద్రం మండలం చెంబకూరు లో జరుగుతున్న రెవిన్యూ గ్రామ సభకు శనివారం ఆయన ముఖ్య అథితిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. . రైతులకు పంటల పెట్టుబడులు కు నాలుగేళ్ళ పాటు ఏడాదికి 12.500 రూపాయలు ఇస్తామని చెప్పిన మన జగనన్న నాలుగేళ్లు కాకుండా ఐదేళ్లు ఇస్తానని, అది ఇంకా వెయ్యరూపాయిలు పెంచి 13.500 ఇస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు. ఇంత వరకు మన భారతదేశం లోని ఏ ముఖ్యమంత్రి రైతులకు పెట్టుబడులు కు ఇంత పెద్దమెత్తంలో పెట్టుబడులు కు నగదు ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. రైతుల భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించేందుకు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో తహశీల్దార్ జి రవి, వైసిపి నాయకులు భాస్కర్ గౌడు. రామచంద్ర రెడ్డి, హైదర్, కేశవరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్, ఆనంద్ రెవెన్యూ సిబ్బంది, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చండి

 

Tags:Farmers prosper during the YCP regime

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *