పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద రైతులు నిరసన

Date:09/05/2020

పలమనేరు ముచ్చట్లు:

జిల్లాలోని పలమనేరు కూరగాయల మార్కెట్ లో యజమానులు చేస్తున్న అరాచకాలను భరించలేక రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. మార్కెట్ యార్డులో యజమానులు రైతుల దగ్గర్నుంచి కమిషన్ 4శాతం కమిషన్ వసూలు చేయాల్సి ఉంది… కానీ ఇక్కడ 10 శాతం వసూళ్లు చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన తెలియజేశారు. కరోన నేపథ్యంలో ఇక్కడ కేజీ టమాటా మూడు రూపాయలు తో తీసుకుంటున్నారని, సమీపంలోనున్న కర్ణాటక రాష్ట్రంలోని వడ్డిపల్లి మార్కెట్ లో బాక్సు ధర రూ. 50లు పలుకుతుందని, అదే విధంగా తిరుపతిలో రూ. 60లు, గుంటూరు రూ.80లతో రైతులకు అందిస్తున్నారు. కాని ఇక్కడ అ పరిస్థితి లేదని ఆవేదన తెలియజేశారు రైతులకు విశ్రాంతి భవనం గాని, మరుగుదొడ్లు గాని లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సమాచారం అందించడం గాని ఏదీ లేదని వాపోయారు.

ఘటన దురదృష్టకరం

Tags: Farmers protest at Palmaneru Agricultural Market Yard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *