ఢిల్లీలో హింసాత్మకంగా మారిన రైతుల ర్యాలీ,

-ఎర్రకోటపై జెండా ఎగరేసిన రైతులు

Date:26/01/2021

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు.. దేశ రాజధాని ఢిల్లీలో బీభత్సం సృష్టించారు. 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై రైతులు తమ జెండాను ఎగురవేశారు.  చట్టాలను వ్యతిరేకిస్తూ ట్రాక్టర్ ర్యాలీ తీసిన రైతులు ఢిల్లీ నగరంలోకి దూసుకువెళ్లారు. వేలాది సంఖ్యలో సిక్కు రైతులు ఇవాళ ఉదయం నగరం నలువైపుల నుంచి ర్యాలీ తీశారు. రాజ్పథ్లో గణతంత్ర వేడుకలు జరుగుతున్న సమయంలోనే.. ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు.  నగరంలోకి దూసుకువచ్చిన రైతులను పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ఎర్రకోట ప్రాంగణానికి కూడా భారీ సంఖ్యలో రైతు ఆందోళనకారులు వచ్చారు.  అయితే కోటపైకి ఎక్కిన ఓ రైతు జెండాలను పాతారు. సింగు, టిక్రి,,ఘాజీపూర్ సరిహద్దులనుంచి రైతులు ఒక్కసారిగా దూసుకువచ్చారు.

విశిష్ట సేవలందించిన ఎంవిఐ సుబ్రమణ్యంకు కలెక్టర్‌ చే ప్రశంసాపత్రం

Tags; Farmers’ rally turns violent in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *