నకిలీ విత్తనాలతో రైతుల విలవిల 

Farmers' ranges with fake seeds

Farmers' ranges with fake seeds

Date:06/10/2018
ఖమ్మం ముచ్చట్లు:
మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. అసలే వరదలకు పంటనష్టమొచ్చి నానా బాధలు పడుతుంటే….నకిలీ విత్తనాల పుణ్యమా అని బాగా పండాల్సిన పంట కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఓవైపు వరదలతో తీవ్ర నష్టాలు… మరోవైపు వ్యాపారుల మాటలతో నిలువునా మోసపోతున్నారు మిర్చి రైతులు. నకిలీ విత్తనాలతో వ్యాపారులు మాయమాటలు చెప్పి  రైతులను నిలువునా ముంచేస్తున్నారు.
తమ కంపెనీకి చెందిన విత్తనాలు సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని నమ్మిస్తున్నారు. దీంతో  రైతులందరూ అప్పులు చేసి.. మిర్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని సుమారు 200 మంది రైతులు వైరాలోని ఓ డీలరు వద్ద మిర్చి విత్తనాలను కొనుగోలు చేశారు. ఖరీఫ్‌లో మంచి దిగుబడులు సాధించాలన్నా తపనతో సాగు ప్రారంభించారు. చివరకూ మొక్కలు పూతకు రాక, తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అనేక ఆశలతో పంటను పండించుకున్నా… నెలన్నర వయసుకు వచ్చిన తరువాత మిర్చి పైరుకి ముడతరోగం వచ్చింది.
చెట్లు ఎపుగా పెరుగుతున్నాయే తప్ప వాటికి ఏమాత్రం పూత, కాత లేదు. దీంతో విషయాన్ని గ్రహించిన  రైతులు చుట్టుపక్కల అధికారులకు ఫిర్యాదు చేశారు. విత్తనాల లోపం కారణంగానే ఇలా ముడతరోగం వచ్చిందని అధికారులు తెలపడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను మోసం చేసిన వ్యాపారులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారు.మరోవైపు గుంటూరు జిల్లాలోనూ ఇదే తరహాలో మిర్చి రైతులు మోసపోయారు.
లగడపాడు, అత్తలూరు, రామాపుం గ్రామాల్లోని రైతులు…తమ కష్టాన్నంతా పెట్టుబడిగా పెట్టి పంట పండించారు. తీరా మొలకసమయమొచ్చేసరికి ఎలాంటి ఫలితమూ లేకపోవడంతో వ్యాపారుల మోసాన్ని గ్రహించారు. నకిలీ విత్తనాల వల్లే తీవ్ర నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.
నకిలీ మిర్చి విత్తనాలతో మోసపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వ్యవసాయ శాఖాధికారుల ఎదుట సుమారు 150 మంది రైతులు ఆందోళన చేపట్టారు. నకిలీ విత్తనాలతో తమను మోసం చేసిన వ్యాపారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
Tags:Farmers’ ranges with fake seeds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *