Natyam ad

రైతుల సజ్జ పంట ధాన్యాన్ని మార్క్ఫెడ్ ద్వార కొనుగోలు చేయాలి

-రాష్ట్ర రైతు సలహాదారు అంబటి కృష్ణారెడ్డి
 
కడప ముచ్చట్లు:
 
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో   రాష్ట్ర రైతు సలహాదారు అంబటి కృష్ణారెడ్డి  సజ్జ పంట  ధాన్యం కొనుగోలు పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు, బద్వేల్ ,గోపవరం, బి.కోడూరు పోరుమామిళ్ల, కాశినాయన ,కలసపాడు మండలాలలో గత ఆగస్టు నెలలో రైతులు సజ్జ పంటను కోసి ధాన్యాన్ని రైతులు అమ్మేందుకు సిద్ధం చేశారు. ప్రభుత్వం మద్దతు ధర గా 2250 రూపాయలు క్వింటాలు ధర నిర్ణయించింది .అదే బహిరంగ మార్కెట్లో క్వింటాలు 1750 రూపాయలు మించి ఉండటం లేదు. దీంతో రైతులు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించాలని నాలుగు నెలలుగా ధాన్యాన్ని గృహాల్లో నిల్వ చేసుకున్నారు .కానీ మార్క్ఫెడ్ డిఎం లావణ్య ఎన్నికల కోడ్ అనంతరం సజ్జ పంట ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు .కానీ నవంబర్ నెలలో వర్షాలు కురవడంతో  కొనుగోలు చేయలేదు. దీంతో నాలుగు నెలల జాప్యం జరగడంతో కొందరి రైతుల ధాన్యం లో పురుగు ఉన్నాయన్న సాకుతో మార్కఫెడ్ వారు కొనుగోలు చేయడం లేదు .మన సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులు ఎవరు నష్టపోకూడదనే ఆదేశాలు జారీ చేస్తున్న మార్క్ఫెడ్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి కొనుగోలు చేయకపోవడంతో చాలామంది రైతులు ఇప్పటికే బహిరంగ మార్కెట్లో అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారు .ఇప్పటికైనా మిగిలివున్న ధాన్యాన్ని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతు సలహాదారు అంబటికృష్ణారెడ్డి మార్క్ ఫెడ్ వారికి సూచించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Farmers’ ready-made crop grain must be purchased through Markfed