రైతులు కుదేలు

అమరావతి   ముచ్చట్లు :
కూరగాయలు, ఆకు కూరలు, పళ్లు, పూలు పండించే రైతులకు కోవిడ్‌ కోలుకోలేని దెబ్బవేస్తోంది. సాగు దగ్గర నుంచి దిగుబడుల కోతలు, వాటికి సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో ఈ రెండేళ్ల కాలంలో కూరగాయలు, పళ్లు, పూల పంటలను సాగుచేసే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఏడాది వాతావరణం అనుకూలించినా కోవిడ్‌తో సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలీక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూరగాయాల ధరలు వినియోగదారునికి మార్కెట్‌లో చుక్కలు చూపింస్తున్నా ఆ ప్రతిఫలం రైతుకు దక్కని పరిస్థితి వుంది. ఆకుకూరలు, కూరగాయలు, పూలు కోతకోసిన వెంటనే మార్కెట్‌లో అమ్మకం జరిగితేనే రైతుకు అంతో ఇంతో ధర దక్కుతుంది. అమ్మకం ఒక్కరోజు ఆలస్యం అయినా పారబోయాల్సిన పరిస్థితి. సాధారణంగా ఉల్లికి ఈ సీజన్‌లో క్వింటా సగటున రూ2500పైనే రైతుకు లభించేది. ఇపుడు సగటున వెయ్యి నుండి 1300 రూపాయల మద్యనే రైతుకు ధర వస్తుండటంతో ఉల్లిరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడి రైతులూ తీవ్ర నష్టాలను మూటకట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో పండించే బంగినపల్లి రకం మామిడికి గల్ఫ్‌లో మంచి డిమాండ్‌. సాధారణ రోజుల్లో ఎక్స్‌పోర్ట్‌ బంగినపల్లి మామిడి రకం టన్ను రూ 80వేలకు పైబడి వుండేది. కోవిడ్‌తో ఎగుమతులు స్థంభించిపోవడం, స్థానిక మార్కెట్‌పైకూడా కర్ఫ్యూ ప్రభావంతో టన్ను రూ 40వేలకు కూడా కొనే నాథుడు లేని పరిస్థితి. అలాగే అరటి రైతులదీ అదే సమస్య గత ఏడాది అరటి ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలతో మార్కెటింగ్‌ చేసేందుకు ప్రణాళికను తయారు చేసినా కోవిడ్‌ తీవ్రతతో ఈ ప్రయోగం విఫలమయ్యింది. కోవిడ్‌తో రెండేళ్లనుండి పూలరైతులకు ఒక్కరూపాయి చేతికి రాని పరిస్థితి వుంది. టమోటా రైతులు సాగుకు దూరం అవుతున్న పరిస్థితి నెలకొంది.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Farmers shake

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *