Farmers should avail government schemes

రైతులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

-వైఎస్‌ఆర్‌ తోటబడి , పొలంబడితో ప్రారంభం

Date:10/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉధ్యానవనశాఖాధికారి లక్ష్మీప్రసన్న కోరారు. సోమవారం మండలంలోని గానుగలగడ్డ గ్రామంలో వైఎస్‌ఆర్‌ తోటబడి కార్యక్రమాన్ని ఆమె రైతులతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ తోటబడి కార్యక్రమం క్రింద మామిడి, పండ్ల తోటలకు కొమ్మలు క త్తరించే విధానాన్ని రైతులకు వివరించారు. అలాగే కొమ్మలు కత్తరింపు తరువాత బోర్డోపేస్ట్ క్రీమ్‌ వినియోగించే విధానం వివరించి, దాని ద్వారా ఉపయోగాలను తెలియజేశారు. చెట్లకు పాదులు చేసే విధానంపై వివరించారు. ఎరువులు, యాజమాన్య పద్దతులపై వివరించారు. ఉధ్యానవనశాఖ ద్వారా మామిడి, జామ, చీనితోటల పెంపకం, పందిరి నిర్మాణాలు, ప్యాక్‌ హౌస్‌లతో పాటు రకరకాల పథకాలను రైతులకు సబ్సిడిపై అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఉధ్యానవనశాఖద్వారా అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వ పథకాలు పొందాలన్నారు. ముఖ్యంగా రైతులు ఈక్రాప్‌ ద్వారా తమ పంటలను నమోదు చేసుకున్న వారికి మాత్రమే అర్హత ఉంటుందని తెలియజేశారు.

పొలంబడి….

మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో వ్యవసాయాధికారి సంధ్య ఆధ్వర్యంలో పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేరుశెనగ పంటల గూర్చి ఆమె వివరించారు. వేరుశెనగకు వస్తున్న ఆకుమచ్చ తెగులు గురించి వివరించి, వాటిని నివారించేందుకు క్లోరోతానిల్‌ను రెండు గ్రాముల మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. రవికుమార్‌నాయక్‌ అనే రైతు పండించిన పంటలను ఆమె పరిశీలించి రైతును అభినందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగి వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్మా అంటే ఏమిటి.. 

Tags: Farmers should avail government schemes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *