పశువుల ఎరువు వాడకాన్ని రైతులకు ప్రోత్సహించాలి

Date;28/02/2020

పశువుల ఎరువు వాడకాన్ని రైతులకు ప్రోత్సహించాలి
రైతు భరోసా కేంద్రాలు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్

కర్నూలుముచ్చట్లు

గ్రామీణ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే పశువుల ఎరువు వాడకాన్ని రైతులు పొలాలలో వినియోగించేలా రైతులకు ప్రోత్సహించాలని వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులకు కర్నూలు  జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో వ్యవసాయ అనుబంధ శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాలు పై వ్యవసాయ,  పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ అధికారులకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగింది. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అందించే సేవలు తదితర అంశాలపై  వ్యవసాయ శాఖ,  పశుసంవర్థక శాఖ,  మత్స్యశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ రైతు భరోసా కేంద్రాలు అవగాహన సదస్సులో ఏర్పాటు చేసిన మోడల్ రైతు భరోసా కేంద్రం స్టాల్ ను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రకృతిలో ఒక భాగంగా.. ప్రకృతిలో లభించే వనరులతో మాత్రమే వ్యవసాయం చేస్తూ మానవాళి ఆకలి తీర్చడమే లక్ష్యంగా మానవుడు  చేపట్టిన వ్యవసాయమే.. సేంద్రీయ వ్యవసాయమని తెలిపారు*. *నేడు అనేక మార్పులు చెందుతూ ప్రకృతి విరుద్దంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతూ పండించే పంటల  వలన ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పూర్వపు సేంద్రీయ వ్యవసాయాన్ని ఆచరించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొన్నారు.
రసాయన ఎరువులు వాడకుండా పకృతి వ్యవసాయం సహజసిద్ధంగా లభించే ఆవుమూత్రం, ఆవుపేడ, పప్పుల పిండి, వివిధ రకాల ఆకులు తో తయారుచేసిన ఘనజీవామృతం, కషాయాలు  వాడకం పెంపొందించాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అన్ని సేవలు అందించాలని  రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పకృతి  వ్యవసాయం పై గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులు వ్యవసాయం  చేయడానికి అధునాతన వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉంచి రైతు అభివృద్ధికి తోడ్పడాలి అన్నారు*. *గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం  ఏర్పాటు చేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలలో పలురకాల సేవలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ, మత్స్య, పశుసంవర్ధక శాఖ, డి ఆర్ డి ఎ,  ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి రైతులకు అన్ని సేవలు అందేలా చూడాలన్నారు. అనంతరం ఢిల్లీలో నిర్వహించిన కిట్ బాక్సింగ్ లో ప్రతిభ చూపిన కంబాలపాడు  పశు వైద్యాధికారి డాక్టర్ బాబా ఫక్రుద్దీన్ ను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ సన్మానించారు*. *ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ – 2 సయ్యద్ ఖాజా మొహిదీన్, అగ్రి కల్చర్ జెడి విల్సన్,  పశుసంవర్ధక శాఖ జెడి రమణయ్య, మత్స్యశాఖ, ఆత్మ శాఖ, సిరి కల్చర్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Tags;Farmers should be encouraged to use livestock manure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *