రైతులు ఉత్పత్తిదారు సంస్థలలో నమోదు కావాలి
పుంగనూరు ముచ్చట్లు:
చిన్న, సన్నకారు రైతులు అందరు రైతు ఉత్పత్తిదారుల సంస్థలలో చేరి, అభివృద్ధి చెందాలని ఉధ్యానవనశాఖాధికారి సంతోషికుమారి తెలిపారు. గురువారం రైతు ఉత్పత్తిదారుల సమావేశాన్ని పట్టణంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపిమాస్ సంస్థ ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకు 420 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. కేంద్రం వాటాగా ఇప్పటి వరకు రు.15 లక్షలు సంఘానికి అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘాలు మరిన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. దీని ద్వారా పశువులకు దానా, టార్ఫాలిన్ పట్టాలు, పశువుల మందులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం క్రిమిసంహరక మందులు, ఎరువులు కూడ విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో పూర్తి నిర్వహణ బాధ్యతలు రైతులదే ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల సంస్థ కార్యదర్శి సుజాత, మాస్ సంస్థ మేనేజర్ డాక్టర్ ఎస్.ప్రహ్లద, సంఘ ప్రతినిధులు హరికిషోర్‌రెడ్డి, జానకి, రెడ్డెప్ప, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సుబ్రమణ్యంతో పాటు రైతులు పాల్గొన్నారు.

Tags: Farmers should be registered with producer organizations
