రైతు భరోసా అందని రైతులు నిరాశ చెందవద్దు

Date:09/11/2019

భాకరాపేటముచ్చట్లు:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల లో ఒకటిగా ఉన్న రైతు భరోసా పథకం ద్వారా లబ్ది చేకూరని రైతులు నిరాశ చెందవద్దని చిన్నగొట్టిగల్లు వ్యవసాయ శాఖ అధికారి సంజీవ రెడ్డి అన్నారు. శనివారం తాహశీల్దార్ కార్యాలయంలో రైతు భరోసా పథక లబ్ది పొందని రైతుల దగ్గర నుంచి వన్ బి ఆధార్ కార్డ్ రేషన్ కార్డుల తో పాటు బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్ లను తీసుకున్నారు. ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని అర్హత ఉండి లబ్ధి పొందని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకుండా మరల దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నదని అని తెలిపారు. సోమవారం స్పందన కార్యక్రమంలో అర్జీల రూపంలో వినతిపత్రాన్ని సమర్పించినట్లయితే విచారించి తగు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దస్తగిరయ్య ఆర్.ఐ లు విఆర్వోలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తు

 

Tags:Farmers should not be disappointed if the farmer is not assured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *