15లోపు రైతులు ఉధ్యానపంటల నమోదు చేసుకోవాలి

– ఏడి దశరథరామిరెడ్డి

Date:11/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

రైతులు తమ పంటల నమోదు కార్యక్రమాన్ని ఈనెల 15లోపు ఈ కర్షక్‌ ద్వారా నమోదు చేసుకోవాలని ఉధ్యానశాఖ ఏడి దశరథరామిరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన సచివాలయాలలో నియమితులైన సెరికల్చర్‌ , హార్టికల్చర్‌, వ్యవసాయశాఖ ఉద్యోగులతో సమావేశాన్ని హర్టికల్టర్‌ ఆఫీసర్‌ లక్ష్మీప్రసన్న ఏర్పాటు చేశారు. సమావేశానికి ఏడి దశరథరామిరెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఈకర్షక్‌ ద్వారా రైతుల పంటలను నమోదు చేసుకోవాలన్నారు. ఉద్యోగులు ప్రతి ఒక్కరు రైతు పొలల వద్దకు వెళ్లి పంటలను ఆన్‌లైన్‌లో ఫోటోలతో సహా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ఈనెల 15 లోపు పూర్తి చేయాలన్నారు. అలాగే ఫారంఫాండ్‌లు, ఫ్యాక్‌ హౌస్‌ల ఏర్పాటుకు రైతుల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

ఢిల్లీలో క్రేజివాల్‌ విజయంపై ముస్లింల సంబరాలు

Tags: Farmers under 15 need to register for furniture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *