Farmers Vilavila with Corona

కరోనాతో కర్షకులు విలవిలా

– పశువుల మేతగా టమోటా
– కరోనాతో స్తంభించిన వ్యవసాయం
– రైతుల పెట్టుబడి లక్షల్లో
– అప్పుల్లో కురుకుపోతున్న అన్నదాతలు

Date:04/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు అందరికి బువ్వ పెట్టె రైతన్న కుదెలువుతున్నాడు. రైతులకు కష్టమోస్తే సకల జీవరాశికి బువ్వ దొరకదన్న విషయాన్ని ఆ దేవుడు మర్చిపోతున్నాడు. అసలే కరువు కాటకాలు… ఆపై చేసిన పంటలకు తెగుళ్లు… ఇన్ని సమస్యలున్నా… మన ఐదు వ్రేళ్ళు నోటిలోకి పంపడానికి అన్నదాతలు రేయింబవళ్లు ఒళ్ళు ఉనం చేసుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు రైతులకు పెట్టుబడులు కూడా దక్కే అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో సాగు చేయాలని అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన అన్నదాతలకు కరోనా నడ్డి విరుస్తోంది. వ్యవసాయ బోర్లల్లో వచ్చే అరకొర నీటితో టమోటా సాగు విస్తీర్ణంగా సాగు చేస్తున్నారు. అయితే కోత దశకు వచ్చేలోపు ఈ మహమ్మారి దావణంలో వ్యాపించడంతో రైతులు పండించిన పంటకు మార్కెట్లు కరువైయ్యాయి. దీనితో కన్న బిడ్డ వలే సాగు చేసిన పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకునే దౌర్బగ్య స్థితిలోకి చేరుకున్నారు. ప్రతి రైతు పంట సాగు కోసం మహిళా గ్రూపుల్లో, స్త్రీ నిధిల్లో డబ్బులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న కరోనా మహమ్మారి దెబ్బకు నెలసరి చెల్లించాల్సిన డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి దాపురించింది. ఆరుగాలం కష్ట పడి సాగు చేసిన టమోటా పంట నేడు పశువుల మేతగా మారింది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

కరోనా తో కలిసి ఉండాల్సిందే :

Tags: Farmers Vilavila with Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *